
Most Admired Men: బైడెన్, పుతిన్ కంటే ముందున్న మోదీ..!
అత్యంత ఆరాధనీయ వ్యక్తుల జాబితాలో 8వ స్థానంలో
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆరాధనీయ వ్యక్తిగా ప్రధాని నరేంద్రమోదీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. YouGov సంస్థ 2021లో విడుదల చేసిన అత్యంత ఆరాధనీయ వ్యక్తుల జాబితాలో మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల కంటే ముందున్నారు.
అంతర్జాతీయంగా నిర్వహించిన ఈ సర్వేలో.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలిచారు. వరుసగా రెండో ఏడాది ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ రెండో స్థానంలో ఉండగా.. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మూడో స్థానంలో ఉన్నారు. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో, యాక్షన్ స్టార్ జాకీ చాన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ, మోదీ, పుతిన్, చైనా వ్యాపారవేత్త జాక్మా తరువాత స్థానాల్లో ఉన్నారు. 38 దేశాలు, ప్రాంతాలకు చెందిన 42వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మొదటి 20 స్థానాల్లో మన భారతీయులు మరో నలుగురు ఉన్నారు. సచిన్ తెందూల్కర్(12), షారుక్ ఖాన్(14), అమితాబ్ బచ్చన్(15), విరాట్ కోహ్లీ(18) చోటు దక్కించుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 17వ స్థానం, బైడెన్ 20వ స్థానంలో నిలిచారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.