కుమారుడి కోసం చిరుతతో తల్లి పోరాటం

మధ్యప్రదేశ్‌లో ఓ తల్లి ప్రదర్శించిన ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. కుమారుడిని నోట కరచుకుపోతున్న చిరుతతో పోరాడి బిడ్డను రక్షించుకుంది బైగా తెగకు చెందిన కిరణ్‌ అనే మహిళ. సిద్ధి జిల్లా బరిజహారియా

Updated : 01 Dec 2021 10:08 IST

ధ్యప్రదేశ్‌లో ఓ తల్లి ప్రదర్శించిన ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. కుమారుడిని నోట కరచుకుపోతున్న చిరుతతో పోరాడి బిడ్డను రక్షించుకుంది బైగా తెగకు చెందిన కిరణ్‌ అనే మహిళ. సిద్ధి జిల్లా బరిజహారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం తన ఇంటి వద్ద పిల్లలతో కలిసి చలిమంట కాచుకుంటోంది కిరణ్‌. ఓ బిడ్డ ఆమె ఒడిలో కూర్చోగా మరో ఇద్దరు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత ఓ పిల్లాడిని నోట కరచుకుని అడవిలోకి పరుగులు తీసింది. వెంటనే కిరణ్‌ సైతం దాన్ని వెంబడించింది. కిలోమీటరు దూరంలో చిరుతను గుర్తించి.. పోరాడి కుమారుడిని రక్షించింది. తల్లిబిడ్డలపై చిరుత దాడి చేస్తుండగా.. అంతలోనే గ్రామస్థులు వచ్చి దానిని తరిమేశారు. గాయపడిన తల్లిబిడ్డలను ఆసుపత్రిలో చేర్పించారు. వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని