Published : 30 Dec 2021 14:21 IST

Corona: నాలుగు డోసులు తీసుకున్న మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌..!

మధ్యప్రదేశ్‌లో జరిపిన కొవిడ్‌ పరీక్షల్లో గుర్తింపు

ఇండోర్‌: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను తీసుకున్నప్పటికీ వైరస్‌ సోకే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు డోసులు తీసుకున్న ఓ మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు సాధారణంగా చేపట్టిన పరీక్షల్లో దుబయ్‌కి చెందిన ఓ మహిళలకు వైరస్‌ నిర్ధారణ అయ్యింది.

‘ఇతర దేశాల్లో నాలుగు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ 30ఏళ్ల మహిళ ఇటీవలే ఇండోర్‌ వచ్చింది. ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారం నిర్వహించే కొవిడ్‌ పరీక్షలకు ఆమె నమూనాలు ఇచ్చింది. అందులో ఆ మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల క్రితం జలుబు, దగ్గు వచ్చినట్లు ఆ మహిళ పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. అయినప్పటికీ, ముందుజాగ్రత్తగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించాం’ అని ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భురే సింగ్‌ సెథియా పేర్కొన్నారు.

దుబయ్‌ నుంచి 12 రోజుల క్రితమే ఆ మహిళ ఇండోర్‌కు చేరుకుంది. అనంతరం బంధువుల వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మళ్లీ తిరిగి దుబయ్‌ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడ జరిపిన సాధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్యకాలంలో సినోఫామ్‌, ఫైజర్‌కు చెందిన టీకాలను రెండు డోసుల చొప్పున ఆమె తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 7లక్షల 93వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 10,533 మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని