Published : 30/11/2021 17:25 IST

Mumbai: టీకా తీసుకుంటారా? లేదా జరిమానా కడతారా?

ముంబయి: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ యావత్‌ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ వేరియంట్‌పై అప్రమత్తతగా ఉంది. ఈ వైరస్‌ గనక భారత్‌లో ప్రబలితే మూడో వేవ్‌ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబయి యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా టీకా ప్రతిఒక్కరు తీసుకునే దిశగా.. టీకా వేసుకోవడాన్ని తప్పనిసరి చేసే అవకాశాలున్నాయని ముంబయి మేయర్‌ కిశోరి పడ్నేకర్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ వేసుకోని వారికి జరిమానా విధిస్తామని, ప్రజా రవాణాకు వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై జాగ్రత్తగా ఉన్నామని, యూరోప్‌ దేశాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు మేయర్‌ తెలిపారు. ఆసుపత్రులు, ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆఫ్రికన్ దేశాల నుంచి గత పదిహేను రోజుల్లో కనీసం 1,000 మంది ప్రయాణికులు ముంబయికి వచ్చారని బీఎంసీ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు 466 మంది ప్రయాణికుల జాబితాను అందుకున్నామని, కనీసం 100 మంది ప్రయాణికుల నుంచి స్వాబ్ నమూనాలు సేకరించించామని బీఎంసీ అదనపు కమిషనర్ సురేష్ కాకాని తెలిపారు.

 

Read latest National - International News and Telugu News

 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని