Afghan crisis: బాంబుల మోత మోగినా.. మళ్లీ అదే వ్యథ..!

ఉగ్రదాడి అనంతరం కాబుల్ విమానాశ్రయంలో శుక్రవారం తిరిగి అత్యవసరంగా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్‌ వంటి పలు దేశాలు ఈ రోజుతో తరలింపును ముగించాలనే నిర్ణయానికి వచ్చాయి. తమ దేశీయులు, ఇప్పటికే ఆశ్రయం కోసం అనుమతి పొందిన వారికి మినహా కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదని తెలిపాయి. 

Published : 28 Aug 2021 02:18 IST

కాబుల్: ఉగ్రదాడి అనంతరం కాబుల్ విమానాశ్రయంలో శుక్రవారం తిరిగి అత్యవసర తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్‌ వంటి పలు దేశాలు ఈ రోజుతో తరలింపును ముగించాలనే నిర్ణయానికి వచ్చాయి. తమ దేశీయులు, ఇప్పటికే ఆశ్రయం కోసం అనుమతి పొందిన వారికి మినహా కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదని తెలిపాయి. 

మరోపక్క నిన్ననే బాంబు పేలుళ్లతో విమానాశ్రయం దద్దరిల్లింది. మృతుల సంఖ్య వంద దాటింది. 150 మందికి పైగా గాయపడ్డారు. వాస్తవంలో మరణాలు మరింత ఎక్కువగా ఉండొచ్చని స్థానిక అధికారులు హెచ్చరించారు. అయినా సరే విమానాశ్రయం వద్దతాకిడి ఏ మాత్రం తగ్గలేదు. పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఒకవైపు బాంబుదాడి భయం వారిని వేధిస్తున్నప్పటికీ.. దేశం దాటాలనే ఆత్రమే ప్రతిఒక్కరిలో కనిపిస్తోంది. కొందరు విమానాశ్రయం లోపలికి ప్రవేశించేందుకు మురికి కాలువ నీటిలో నిల్చుండిపోయారు. తమ వంతువచ్చే వరకు అక్కడ గోడల వద్ద వేచిచూస్తున్న దృశ్యాలను అక్కడి మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తెచ్చింది.  

ఇదిలా ఉండగా.. కాబుల్ విమానాశ్రయం వద్ద  మరికొన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంన్జీ ప్రకటించారు. ఈ సారి రాకెట్లు, వాహన బాంబులతో ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. అందుకు తగ్గట్టే తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా కూడా ఈ తరహా హెచ్చరికే చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని