
NIA: ఎన్‌ఐఏ చేతికి జమ్మూకశ్మీర్ వరుస హత్యల కేసు..!
దిల్లీ: మైనార్టీలు, వలస కార్మికులు లక్ష్యంగా ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో జరుగుతోన్న హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు 11 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనల వెనుక ఉన్న కుట్రను వెలికితీయాలని ఎన్‌ఐఏని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో స్థానిక పోలీసులు విచారిస్తోన్న కేసులు ఎన్‌ఐఏ పరిధిలోకి రానున్నాయి.
ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారిపై ఉగ్రవాదులు గురిపెడుతున్నారు. ఆదివారం మరో ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలు బలిగొన్నారు. దీంతో ఈ నెలలో అమాయకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 11కు చేరింది. కుల్గాంలోని వానిపోహ్ వద్ద కూలీలపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికేతరులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. అంతకు ముందు కశ్మీర్ లోయలోని శ్రీనగర్‌లో పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగించే అరబింద్ కుమార్ షా (బిహార్), పుల్వామాలో సిరాజ్ అహ్మద్ అనే కార్పెంటర్ (ఉత్తరప్రదేశ్)ను కాల్చి చంపారు. ఇప్పటివరకు మరణించిన వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.