Omicron Scare: యూపీలో రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి.. ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ఆంక్షల దిశగా నడిపిస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌(యూపీ) శనివారం(డిసెంబర్ 25) నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనుంది.

Published : 24 Dec 2021 13:20 IST

లఖ్‌నవూ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి.. ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ఆంక్షల దిశగా నడిపిస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ శనివారం(డిసెంబర్ 25) నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అలాగే వివాహాలు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా పాల్గొన్న వారంతా తప్పకుండా కొవిడ్ నిబంధలను పాటించాలని స్పష్టం చేసింది. 

ఇప్పటికే మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాత్రి కర్ఫ్యూపై ప్రకటన చేయగా..ఇప్పుడు యూపీ ఆ జాబితాలోకి చేరింది. మధ్యప్రదేశ్‌లో నిన్నటి నుంచే ఈ ఆంక్షలు అమలవుతున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అవి కొనసాగుతాయని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. క్రిస్మస్, న్యూఇయర్ వేడులకపై నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటన చేసింది. 

ఇదిలా ఉండగా..కొద్ది నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పార్టీలన్నీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో యూపీలోని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా యూపీతో సహా పలు రాష్ట్రాల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అంతేగాక, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని