
Updated : 04 Nov 2021 15:43 IST
దీపావళి వేళ బిహార్‌లో ఘోరం: కల్తీ మద్యం తాగి 9 మంది మృతి
పలువురికి అస్వస్థత
పట్నా: దీపావళి పండగ వేళ బిహర్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తొమ్మిది మంది ప్రాణాలు తీసింది. అస్వస్థతకు గురైన మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ నావల్ కిశోర్ చౌదరీ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరగవచ్చన్న సమాచారంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి
Tags :