Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి..!

వైద్యశాస్త్రంలో విశేష సేవలందించినందుకు ప్రపంచంలోనే అత్యున్నత పురుస్కారంగా భావించే నోబెల్‌ ఈసారి ఇద్దరిని వరించింది.

Updated : 04 Oct 2021 17:39 IST

స్టాక్‌హోం: ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్‌ బహుమతి వైద్యశాస్త్రంలో విశేష సేవలందించినందుకు ఈసారి ఇద్దరిని వరించింది. అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లు సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శపై వీరు చేసిన పరిశోధనలకు నోబెల్‌ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్‌ జ్యూరీ వెల్లడించింది.

‘మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, చలి, స్పర్శ వంటి సంకేతాలు ఎలా ప్రారంభమవుతాయనే విషయాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు స్పష్టంగా వివరించాయి. ఈ ఆవిష్కరణలు ఎన్నో శరీరక వ్యవస్థలు, వ్యాధుల పరిస్థితులను తెలుసుకోవడంలో ఎంతో కీలకమైనవి’ అని నోబెల్‌ జ్యూరీ అభిప్రాయపడింది. రోజువారీ జీవితంలో ఈ అనుభూతులను చాలా తేలికగా తీసుకుంటాం.. కానీ, ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాలు ఎలా ప్రేరేపించబడతాయనే ప్రశ్నలకు తాజాగా ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారని నోబెల్‌ జ్యూరీ తెలిపింది.

డేవిడ్‌ జూలియస్‌ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మరో శాస్త్రవేత్త అర్డెమ్‌ పటాపౌటియన్‌ కూడా కాలిఫోర్నియాలోని స్క్రిస్స్‌ రీసెర్చ్‌లో కేంద్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని