Omicron: ఆ దేశాల నుంచి వచ్చేవారికి ఆర్​టీపీసీఆర్ పరీక్ష ముందస్తు బుకింగ్‌ తప్పనిసరి!

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు పౌరవిమానయాన శాఖ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ‘ఎట్‌ రిస్క్‌’ దేశాల నుంచి.....

Published : 15 Dec 2021 01:39 IST

దిల్లీ: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు పౌరవిమానయాన శాఖ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ‘ఎట్‌ రిస్క్‌’ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఈ పరీక్ష కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికోసం పలు నిబంధనలను విధించింది. ‘ఎట్‌ రిస్క్‌’ దేశాల నుంచి వస్తున్నవారితో సహా గడచిన 14 రోజుల్లో ఆ దేశాలను సందర్శించినవారు తప్పనిసరిగా ఆర్​టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది.

ఇందుకోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలని, సంబంధిత విమానాశ్రయం వెబ్‌సైట్‌ లింక్ ‘ఎయిర్ సువిధ పోర్టల్​’లో అందుబాటులో ఉంటుందని కేంద్రం వివరించింది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ని నింపేటప్పుడు ఇది కనిపిస్తుంది. ప్రధానంగా దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం డిసెంబర్ 20 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితిపైనే ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. రాబోయే రెండు వారాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని