Published : 30 Nov 2021 17:15 IST

Omicron: భారత్‌లో.. ఇప్పటివరకు కొత్త వేరియంట్‌ కేసుల్లేవ్‌..!

అయినప్పటికీ.. అప్రమత్తంగానే ఉన్నామన్న కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ప్రభుత్వం.. విదేశీ ప్రయాణికులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ సమాధానం ఇచ్చారు.

‘ఇప్పటికే ఈ వేరియంట్‌ 14 దేశాలకు వ్యాపించింది. భారత్‌లో మాత్రం ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వైరస్‌ నిర్మూలన, వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కూడా చేపడుతున్నాం’ అని మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. వైరస్‌ లక్షణాలున్న అనుమానిత కేసులనూ పరీక్షిస్తున్నామని.. పాజిటివ్‌ వచ్చినట్లయితే వాటిని తక్షణమే జోనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. గత అనుభవాల నుంచి ఎంతో నేర్చుకున్నామన్న ఆయన.. దేశవ్యాప్తంగా అవసరమైన వనరులు, ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ..  నేడు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు నిర్ధారణ పరీక్షలను మరింత ముమ్మరం చేయాలని సూచించింది. అవసరమైన స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు, హోమ్‌ ఐసోలేషన్‌ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని