Omicron: 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్..!

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్దిరోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Published : 08 Dec 2021 17:04 IST

జెనీవా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్దిరోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యకూడా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.  ఒమిక్రాన్‌ కారణంగా వ్యాధి తీవ్రత ఏస్థాయిలో ఉంటుందో, దానిలోని అసాధారణ మ్యుటేషన్లు టీకా రోగనిరోధక శక్తిని ఏమార్చుతాయా..? అనే విషయంపై స్పష్టతకు మరింత సమాచారం అవసరమని పేర్కొంది. అలాగే డెల్టా వేరియంట్‌ కంటే దీని తీవ్రత తక్కువగా ఉన్నా.. ఎక్కువ మందికి వైరస్ సోకితే, ఆసుపత్రిలో చేరే సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. 

ఐరోపాలో ఆసుపత్రుల్లో చేరిక పెరుగుతుంది..

రానున్న వారాల్లో ఐరోపాలో  కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిక, మరణాల సంఖ్య పెరుగుతుందని యూరోపియన్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులకు ఈ వ్యాక్సినేషన్ రేటు సరిపోదని హెచ్చరించింది. ‘రానున్న వారాల్లో కేసులు, మరణాలు, ఆసుపత్రులు, ఐసీయూల్లో చేరిక పెరుగుతుంది. ఒమిక్రాన్‌ వేరియంట్.. ప్రస్తుత పరిస్థితుల్ని మరింత ఆందోళరకరంగా మారుస్తుంది’ అని ఈయూ దేశాలన్ని అప్రమత్తం చేసింది. ఐరోపాకు చెందిన 19 దేశాల్లో ఇప్పటివరకు  274 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది. బాధితుల్లో తీవ్ర లక్షణాలు కానీ, మరణాలు కానీ ఇంతవరకు నమోదు కాలేదని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని