Published : 29/11/2021 01:10 IST

New Variant: ఒమిక్రాన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు.. ప్రమాదకరమే!

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

దిల్లీ: అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ (Spike Protein)లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్లు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నాయి. అందుకే దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతుందన్నారు. ఈ మ్యుటేషన్లే (Mutations) ప్రమాదకరంగా మారవచ్చని.. ఇదే జరిగితే టీకా సామర్థ్యం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌ను ఏ మేరకు ఎదుర్కొంటాయనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.

‘స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొనే చాలా వ్యాక్సిన్‌లు పనిచేస్తాయి. స్పైక్‌ ప్రొటీన్‌లలో వైరస్‌ను గుర్తించినప్పుడు వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలను వృద్ధి చేస్తాయి. తద్వారా మానవ కణంలోకి వైరస్‌ ప్రవేశించకుండా అవి అడ్డుకుంటాయి. కానీ, తాజా వేరియంట్‌లో స్పైక్‌ ప్రొటీన్‌లోనే దాదాపు 30కిపైగా ఉత్పరివర్తనాలు కనిపించాయి. స్పైక్‌ ప్రొటీన్‌ భాగంలో ఎక్కువ ఉత్పరివర్తనాలు (Mutations) సంభవిస్తే వ్యాక్సిన్‌ సమర్థత తగ్గిపోవడానికి దారితీస్తుంది’ అని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడించారు. ఇలాంటి సందర్భంలో భారత్‌లో వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌లతో పాటు అన్ని టీకాల సమర్థతను క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యానికి సంబంధించి వెలుబడే సమాచారంపైనే తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఆధారపడి ఉంటాయని డాక్టర్‌ గులేరియా పేర్కొన్నారు.

ఈ ఒమిక్రాన్‌ (Omicron) వేరియంట్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించకూడదని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు స్థానికంగా కొవిడ్‌ కేసులు అకస్మాత్తుగా పెరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని స్పష్టం చేశారు. వీటితోపాటు రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోని వారు త్వరగా టీకా తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే పలుదేశాల్లో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్‌ మన దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వేరియంట్‌కు సంబంధించి భారత్‌లోని కొవిడ్‌ జీనోమ్‌ కన్సార్టియం ఇన్సాకోగ్‌ (INSACOG) ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తోందని వెల్లడించింది.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న ఈ ఒమిక్రాన్‌ (B.1.1.529) వేరియంట్‌ నవంబర్‌ 24న దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. అనంతరం బోత్సువానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాలకు విస్తరించింది. ఈ వేరియంట్‌పై సమీక్షించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..  ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించింది. అనంతరం దీనికి ఒమిక్రాన్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని