Omicron: ఒమిక్రాన్ కలకలం.. బోట్స్​వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట

దక్షిణాఫ్రికాలోని బోట్స్​వానా నుంచి భారత్​కు వచ్చిన ఓ మహిళను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు అధికారులు.....

Updated : 29 Nov 2021 18:52 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్​’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ గుబులు రేపుతోంది. ఈ వేరియంట్‌ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని బోట్స్​వానా నుంచి భారత్​కు వచ్చిన ఓ మహిళను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు అధికారులు. ఈ నెల 18న ఆమె మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​కు వచ్చినట్లు జబల్​పుర్ వైద్యాధికారి డా.రత్నేష్​ కురారియా తెలిపారు. ఆయన మాట్లాడుతూ..‘బోట్స్‌వానా దౌత్య కార్యాలయం నుంచి ఓ అధికారి మాకు ఫోన్ చేశారు. ఆ దేశం నుంచి వచ్చిన మహిళ.. జబల్​పుర్‌లోని మిలిటరీ ఆర్గనైజేషన్​లో ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు. సదరు మహిళ ఫోన్​ నంబర్​, స్థానికంగా ఉన్న అడ్రస్​ను షేర్ చేయమని వారితో చెప్పాం’ అని తెలిపారు.

సదరు మహిళ పేరు కునో ఓరెమీట్ సెలిన్ అని, ఆమె ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యాధికారి కురారియా పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం.. సెలిన్​ దిల్లీ నుంచి జబల్​పుర్​కు వచ్చినట్లు ఆయన తెలిపారు. జబల్​పుర్​లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని.. పట్టణం​లోని అన్ని హోటళ్లతోపాటు సరిహద్దు జిల్లాల నుంచి సమాచారం సేకరించామని పేర్కొన్నారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని