Updated : 02/12/2021 22:22 IST

Omicron: డెల్టా కంటే ప్రాణాంతకం కాకపోవచ్చు..!

ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌

దిల్లీ: డెల్టా రకం సృష్టించిన విలయంతో పోలిస్తే కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాణాంతకం కాకపోవచ్చని ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో చాలా మంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడి కోలుకోవడంతోపాటు వ్యాక్సినేషన్‌ రేటు అధికంగా ఉండడం వల్ల ఈ వేరియంట్‌ ప్రభావం తక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉంటే తప్ప దాని ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చన్నారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ & పాలసీ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్న ఆయన.. ఓ అంతర్జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు.

‘దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు తక్కువగానే ఉన్నట్లు ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది. సెకండ్‌ వేవ్‌ సమయంలో డెల్టా వేరియంట్‌ కారణంగా ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు, ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి వంటి నష్టాలతో పోలిస్తే తాజా వేరియంట్‌ ప్రభావం తక్కువగానే ఉండవచ్చు’ అని రామనన్‌ లక్ష్మీనారాయణ్ పేర్కొన్నారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ ప్రాణాంతకమని చెప్పే నివేదికలు కూడా ఇప్పటివరకు లేవని ఆస్ట్రేలియా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పాల్‌ కెల్లీ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ భారత్‌లోనూ వెలుగు చూసింది. ఈ వేరియంట్‌కు సంబంధించి రెండు కేసుల్ని మన దేశంలో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇద్దరు రోగుల్లో ఆఫ్రికా నుంచి ఒకరు కాగా.. కర్ణాటకకు చెందిన మరో వ్యక్తిలో ఈ వేరియంట్‌ బయటపడినట్లు వెల్లడించింది. ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) జరిపిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణలో వీరికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను ఇప్పటికే గుర్తించామనీ, వారికి కూడా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్టు తాజాగా బెంగళూరు నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వం.. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని