1,123 కిలోల ఉల్లిగడ్డలను విక్రయించగా.. వచ్చిన లాభం అక్షరాలా ₹13

మహారాష్ట్రలో ఉల్లిగడ్డలను విక్రయించిన ఓ రైతుకు కన్నీళ్లే మిగిలాయి. నెలల పాటు ఒళ్లు గుల్లచేసుకొని కష్టపడితే వచ్చిన లాభం చూసి నివ్వెరపోయాడు......

Published : 04 Dec 2021 22:06 IST

కొల్హాపూర్‌: మహారాష్ట్రలో ఉల్లిగడ్డలను విక్రయించిన ఓ రైతుకు కన్నీళ్లే మిగిలాయి. నెలల పాటు ఒళ్లు గుల్లచేసుకొని కష్టపడితే వచ్చిన లాభం చూసి నివ్వెరపోయాడు. కొల్హాపూర్ జిల్లాకు చెందిన ఓ రైతు తన ఉల్లి పంటను అమ్ముకునేందుకు షోలాపూర్ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లాడు. తన వద్ద ఉన్న 1100 కిలోల ఉల్లిగడ్డలను అక్కడ అమ్మితే అతనికి మిగిలింది ఎంతో తెలుసా..? కేవలం 13 రూపాయలు మాత్రమే..

రెండు రోజుల క్రితం బాబు కడ్వే అనే రైతు.. షోలాపూర్ మండీలో రుద్రేశ్‌ పాటిల్ అనే వ్యాపారికి 24 బస్తాల ఉల్లిగడ్డలను విక్రయించాడు. మొత్తం 1,123 కిలోల ఉల్లిగడ్డలను విక్రయించగా.. అతడికి వచ్చింది రూ.1,665 మాత్రమే. అందులో రవాణా ఖర్చులు, ఇతర ఛార్జీలను తీసేయగా.. ఆ రైతుకు వచ్చిన లాభం అక్షరాలా రూ.13 మాత్రమే. గిట్టుబాటు ధర దక్కక రైతులు అల్లాడుతున్న ఘటనకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది. దీనిపై రైతు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు మద్దతు ధర లభించడం లేదని వారు ఆరోపించారు. ఈ విక్రయానికి సంబంధించిన రసీదు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest National - International News and Telugu News

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని