China Vaccine: చైనాలో 107 కోట్ల మందికి టీకా పూర్తి.. అయినా కొన్ని ప్రావిన్సుల్లో వైరస్‌ వ్యాప్తి

కొవిడ్‌-19 మహహ్మరికి కారణమైన చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ మాత్రం శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 107కోట్ల (76.3శాతం) మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ అందించినట్లు అక్కడి జాతీయ హెల్త్‌ కమిషన్‌ (NHC) ప్రకటించింది.

Updated : 22 Nov 2021 00:07 IST

బీజింగ్‌: కొవిడ్‌-19 మహహ్మరి వెలుగుచూసిన చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 107 కోట్ల (76.3శాతం) మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ అందించినట్లు అక్కడి జాతీయ హెల్త్‌ కమిషన్‌ (NHC) ప్రకటించింది. అంతేకాకుండా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో బూస్టర్‌ డోసు పంపిణీని కూడా మొదలుపెట్టినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 6.5కోట్ల మందికి బూస్టర్‌ డోసును అందజేశామని ఎన్‌హెచ్‌సీ తెలిపింది.

ఓవైపు చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ గణనీయంగా కొనసాగుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను కూడా అమలు చేస్తోంది. జీరో-కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా.. ఒక్క పాజిటివ్‌ కేసు వెలుగు చూసినా లక్షల సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌ పద్ధతులను అనుసరిస్తోంది. పలు ప్రావిన్సుల్లో వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేస్తోంది. వైరస్‌ ప్రభావం మళ్లీ పెరిగితే లాక్‌డౌన్‌ విధించే సూచనలు ఉన్న నేపథ్యంలో అవసరమైన నిత్యావసర సరకులు అందుబాటులో పెట్టుకోవాలని సూచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని