
Corona: కోల్‌కతాలో 80 మందికి పైగా పోలీసులకు కరోనా..!
కోల్‌కతా: దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లు కూడా కొవిడ్ బారిన పడుతుండటం భయాందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తాజాగా 83 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. 16 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ఐఐటీ క్యాంపస్‌లోనూ తాజాగా 60 మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో 40మంది విద్యార్థులు ఉండగా.. మరో 20 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అధిక శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని కొందరు స్పల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ రిజిస్ట్రార్ తమల్‌నాథ్ వెల్లడించారు. కొందరు ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉండగా, కొందరు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ఆస్పత్రులకు చెందిన 100 మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడినట్టు బెంగాల్ ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. వీరిలో 70మంది వైద్యులు కలకత్తా జాతీయ వైద్య కళాశాల, ఆస్పత్రికి చెందినవారు కాగా.. 24మంది చిత్తరంజన్ సేవా సదన్‌కు చెందిన వైద్యులు ఉన్నారు. అలాగే, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీకి చెందిన 12మంది వైద్యులకు కూడా ఈ మహమ్మారి సోకినట్టు తెలిపారు. వీరందరినీ సంస్థాగత క్వారంటైన్లో ఉండాలని సూచించినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.