
citizenship: ఐదేళ్లలో 6 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారు
లోక్సభలో వెల్లడించిన కేంద్రం
దిల్లీ: గత ఐదేళ్ల కాలంలో 6 లక్షల మందికిపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ మేరకు మంగళవారం లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. 2017లో 1,33,049, 2018లో 1,34,561, 2019లో 1,44,017, 2020లో 85,248, 2021 సెప్టెంబర్ 30 నాటికి 1,11,287 మంది తమ పౌరసత్వాన్ని విడిచిపెట్టారని మంత్రి తెలిపారు. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న వివరాల ప్రకారం.. 1,33,83,718 మంది విదేశాల్లో నివసిస్తున్నారు.
ఐదేళ్లలో 4,177 మందికి భారత పౌరసత్వం..
ఇదే ఐదేళ్ల సమయంలో 10,645 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. వారిలో 4,177 మందికి పౌరసత్వం లభించిందని చెప్పారు. 2016లో 1,106, 2017లో 817, 2018లో 628, 2019లో 987, 2020లో 639 మందికి పౌరసత్వ హోదా దక్కినట్లు తెలిపారు. దీనికోసం అమెరికా నుంచి 227 మంది, పాకిస్థాన్ నుంచి 7,782 మంది అఫ్గానిస్థాన్ నుంచి 795 మంది, బంగ్లాదేశ్ నుంచి 184 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.