Covaxin for Children: చిన్నారులకు కొవాగ్జిన్.. ప్రయోగాలు పూర్తి!
భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన ‘కొవాగ్జిన్’ తుది (రెండు, మూడు) దశ ప్రయోగాలు పూర్తి చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రయోగాల సమాచారాన్ని వచ్చే వారం భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేస్తామని ప్రకటించింది.
త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం
హైదరాబాద్: 18ఏళ్లలోపు పిల్లల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన ‘కొవాగ్జిన్’ తుది (రెండు, మూడు) దశ ప్రయోగాలు పూర్తి చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రయోగాల సమాచారాన్ని వచ్చే వారం భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేస్తామని ప్రకటించింది. ఇక ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ అంచనా వేసింది.
‘18ఏళ్లలోపు చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్ 2/3 దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సమాచార విశ్లేషణ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని డీసీజీఐకి వచ్చే వారం అందజేస్తాం. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించాం’ అని హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న (18ఏళ్ల పైబడిన వారికి) కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచామన్న ఆయన.. సెప్టెంబర్ నెలలో 3.5కోట్ల డోసులను ఉత్పత్తి చేశామన్నారు. అక్టోబర్‌లో వీటి సంఖ్య 5.5కోట్లకు కచ్చితంగా పెరుగుతుందని చెప్పారు. ఒకవేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే వీటి సంఖ్యను నెలకు 10కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవాగ్జిన్ ఉత్పత్తి చేసేందుకు ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, హెస్టర్ బయోసైన్సెస్‌తో భారత్ బయోటెక్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయాన్ని కృష్ణ ఎల్లా గుర్తుచేశారు.
ముక్కు ద్వారా టీకాపై ప్రయోగాలు ముమ్మరం..
ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ఈ టీకా వల్ల వైరస్ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే (ముక్కులోనే) రోగనిరోధక ప్రతిస్పందనలు కలుగుతాయి. తద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవడమే కాకుండా ఇన్‌ఫెక్షన్, సంక్రమణ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. వీటి ప్రయోగాలను మూడు విభాగాల్లో చేస్తున్నామని తెలిపారు. మొదటి గ్రూపు వారికి తొలిడోసుగా కొవాగ్జిన్ ఇచ్చి రెండో డోసుగా ముక్కుద్వారా తీసుకునే డోసు ఇస్తున్నాం. అదే విధంగా రెండో గ్రూపులో తొలి, రెండో డోసును ముక్కు ద్వారా అందిస్తున్నాం. మూడో గ్రూపులో ముక్కు ద్వారా తొలిడోసు, కొవాగ్జిన్‌ను రెండో డోసుగా ఇచ్చి పరీక్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రయోగాలను 650 వాలంటీర్లపై జరుపుతుండగా.. 28రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తూ పరీక్షిస్తున్నామని కృష్ణ ఎల్లా వెల్లడించారు.
విదేశాలకు కొవాగ్జిన్ ఎగుమతిపై ప్రశ్నించగా.. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాలకు ఎగుమతి చేస్తామని భారత్ బయోటెక్ సీఎండీ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశీయ అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుందని అభిప్రాయపడ్డారు. ఇక ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా నాలుగో త్రైమాసికం నుంచి విదేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ ఈమధ్యే వెల్లడించింది. దేశ పౌరులకు వ్యాక్సిన్ అందించడమే తొలి ప్రాధాన్యమైనప్పటికీ.. మిగులు డోసులను మాత్రమే ఎగుమతి చేస్తామని పేర్కొంది.
ఇదిలాఉంటే, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు అతి త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అత్యవసర వినియోగ అనుమతులు (ఎమెర్జెన్సీ యూజ్ లిస్టింగ్- EUL) లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందులో భాగంగా డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం అక్టోబర్ 6న సమావేశం కానుంది. ఆ భేటీలోనే డబ్ల్యూహెచ్‌వోకి సలహాలిచ్చే ఇమ్యునైజేషన్ నిపుణుల వ్యూహాత్మక సలహా బృందం (ఎస్‌ఏజీఈ) ‘కొవాగ్జిన్’ టీకా మూడు దశల క్లినికల్ ట్రయల్స్ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలను విశ్లేషించనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: మమ్మల్ని అంతం చేసే కుట్రే..! రాహుల్‌కు శిక్షపై ప్రతిపక్షాల మండిపాటు
-
India News
AAP Vs BJP: దేశ రాజధానిలో ‘పోస్టర్’ వార్..!
-
Movies News
Nani: ఆ దర్శకుడు అందరి ముందు నన్ను అవమానించాడు: నాని
-
Crime News
Crime News : స్టాక్ మార్కెట్ మోసగాడు.. 27 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
Politics News
Cm Kcr: రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10వేలు పరిహారం: సీఎం కేసీఆర్
-
Movies News
Samantha: అలాంటి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది: సమంత