Pakistan: పాక్‌లో రేపిస్టులకు చుక్కలు.. కెమికల్‌ క్యాస్ట్రేషన్‌ బిల్లుకు ఆమోదం

అత్యాచారాలకు పాల్పడటం అలవాటుగా మారినవారిపై పాకిస్థాన్(Pakistan) ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.

Updated : 19 Nov 2021 12:20 IST

ఇస్లామాబాద్‌: అత్యాచారాలకు పాల్పడటం అలవాటుగా మారినవారిపై పాకిస్థాన్(Pakistan) ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. మహిళలు, చిన్నారులపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడి దోషులుగా తేలినవారిపై ఇకనుంచి అక్కడి ప్రభుత్వం కెమికల్‌ క్యాస్ట్రేషన్ అస్త్రాన్ని ప్రయోగించనుంది. అంటే రసాయనాల సహాయంతో రేపిస్టులను నపుంసకులుగా మార్చనుంది. దీనికి సంబంధించిన బిల్లును తాజాగా పాక్‌ పార్లమెంట్ ఆమోదించింది. 

ఇటీవల కాలంలో దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని, వాటిని సమర్థవంతగా అరికట్టాలని ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఈ బిల్లు ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధంగా ఉందని కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలని, క్యాస్ట్రేషన్ గురించి షరియాలో ప్రస్తావన లేదని వారంటున్నారు. ఈ అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో నాలుగు శాతం కంటే తక్కువ కేసుల్లోనే దోషులకు శిక్ష పడుతుందని విమర్శకులు అంటున్నారు.

రసాయనాల సహాయంతో లైంగిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రక్రియను కెమికల్ క్యాస్ట్రేషన్ అంటారు. దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్‌, యూఎస్‌లోని కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా శిక్ష అమల్లో ఉంది. 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన సమయంలో దీనిపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని