Infiltrator: దేశంలో ఉగ్రకుట్ర.. చొరబాటుదారుడిని కాల్చిచంపిన సైన్యం

దాయాది దేశం పాకిస్థాన్‌​ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా సైన్యం అతడిని కాల్చిచంపింది......

Published : 03 Jan 2022 01:31 IST

దిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్‌​ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. జమ్ముకశ్మీర్​ కుప్వారాలోకి లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ (LoC) వద్ద అక్రమంగా ప్రవేశించాలని చూడగా.. సైన్యం అతడిని మట్టుబెట్టింది. దుండగుడి వద్ద నుంచి ఏకే-47 సహా భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. దేశంలో ఉగ్రకుట్రను భగ్రం చేసినట్లు అధికారులు తెలిపారు.

రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని పాక్​ ఉల్లంఘిస్తూనే ఉందని సైనిక ప్రతినిధి వెల్లడించారు. ఇది పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్​ యాక్షన్​ టీమ్​ (BAT) చొరబాటుగా పేర్కొన్నారు. జనవరి 1న కేరన్​ సెక్టార్​లో అక్రమ చొరబాటుకు ప్రయత్నించగా.. వెంటనే స్పందించిన భారత సైన్యం ఆ ఉగ్రవాదిని హతమార్చినట్లు వివరించారు. నియంత్రణ రేఖ వెంబడి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అతడి కదలికలను గమనించినట్లు స్పష్టం చేశారు. మట్టుబెట్టిన ముష్కరుడిని పాక్​కు చెందిన మహ్మద్​ షబ్బీర్​ మాలిక్​గా అధికారులు గుర్తించారు. అతడి వద్ద ఓ ఏకే-47, మందుగుండు సామగ్రి సహా.. పాకిస్థాన్ జారీ చేసినట్లుగా ఉన్న గుర్తింపు కార్డు, వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని