Pakistan: అత్యాచార చట్టంపై పాకిస్థాన్ యూటర్న్.. ‘కెమికల్ క్యాస్ట్రేషన్’ క్లాజ్ తొలగింపు
అత్యాచార కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేసే ‘ద క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2021’పై పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. ఈ చట్టం ఇస్లామిక్ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని అంతర్జాతీయ ఇస్లామిక్ కౌన్సిల్......
ఇస్లామాబాద్: అత్యాచార కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేసే ‘ద క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2021’పై పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. ఈ చట్టం ఇస్లామిక్ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని అంతర్జాతీయ ఇస్లామిక్ కౌన్సిల్(సీఐఐ) స్పష్టం చేయడంతో పాక్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఈ చట్టంలో ఉన్న ‘కెమికల్ క్యాస్ట్రేషన్’ క్లాజ్‌ను తొలగించినట్లు పార్లమెంటరీ న్యాయ కార్యదర్శి జస్టిస్ మలీకా బొకారీ తెలిపారు. ఈ చట్టంలోని అంశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని అంతర్జాతీయ ఇస్లామిక్ కౌన్సిల్ స్పష్టం చేయటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నాసిమ్ ఆధ్వర్యంలో చర్చలు జరిపాకే కెమికల్ క్యాస్ట్రేషన్ అంశాన్ని చట్టం నుంచి తొలగించామన్నారు. అయితే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన రెండో రోజే దాన్ని తొలగించడం గమనార్హం.
పలు దేశాల్లో అమల్లో ఉన్న శిక్ష
రేప్ కేసు దోషులకు లైంగిక సామర్థ్యం తొలగించే ప్రక్రియను వీర్యహరణ శిక్షగా (కెమికల్ క్యాస్ట్రేషన్)గా పిలుస్తారు. వైద్యులు రసాయనాలను ఉపయోగించి అత్యాచార దోషులు శృంగారానికి పనికిరాకుండా చేస్తారు. దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ సహా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ శిక్ష అమల్లో ఉంది.
షరియా చట్టాలకు వ్యతిరేకం
పాకిస్థాన్‌లో నమోదయ్యే అత్యాచార కేసుల్లో 4 శాతం నిందితులు మాత్రమే దోషులుగా తేలుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే రేపిస్టులకు కెమికల్ క్యాస్ట్రేషన్ శిక్ష విధించడం సరికాదని జమాత్-ఎ-ఇస్లామి సెనేటర్ ముస్తాక్ అహ్మద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఇస్లాంకు, షరియా చట్టానికి వ్యతిరేకమన్నారు. రేప్ కేసు దోషులను బహిరంగంగా ఉరితీయడం సరైందేనని, కానీ షరియా చట్టంలో కెమికల్ క్యాస్ట్రేషన్ శిక్ష ప్రస్తావన ఎక్కడా లేదని వాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్