Panjshir: ‘తాలిబన్లు యుద్ధానికి వస్తే.. నేరుగా నరకానికే పంపుతాం’ 

అఫ్గానిస్థాన్లోని పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ఉత్తర కూటమి సేనలు ప్రకటించాయి.

Updated : 03 Sep 2021 12:15 IST

పంజ్‌షేర్‌: అఫ్గానిస్థాన్లోని పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ఉత్తర కూటమి సేనలు ప్రకటించాయి. పంజ్‌షేర్‌లోని కొంత భూభాగాన్ని ఆక్రమించామంటూ తాలిబన్లు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశాయి. పంజ్‌షేర్‌లోకి ప్రవేశించేందుకు తాలిబన్లు పలుమార్లు యత్నించినా వారిని తిప్పికొట్టినట్లు ఉత్తర కూటమి సేనలు వెల్లడించాయి. గతరాత్రి సైతం తాలిబన్‌ మూకలు పంజ్‌షేర్‌పై దాడికి యత్నించగా అనేక మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు తెలిపాయి. ప్రస్తుతం పంజ్‌షేర్‌ ప్రవేశ మార్గాలన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని.. ప్రావిన్స్‌ ఆక్రమణ కోసం తాలిబన్లు యుద్ధానికి వస్తే వారిని నేరుగా నరకానికి పంపుతామని హెచ్చరించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని