Updated : 30/11/2021 11:03 IST

Winter Session: ‘ఆ ఎంపీలు క్షమాపణ చెబితే.. సస్పెన్షన్‌పై ఆలోచిస్తాం’

దిల్లీ: పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమైన రోజే మొదటిరోజే 12 మంది విపక్ష ఎంపీలకు గట్టి షాక్ తగిలింది. గత సమావేశాల్లో( వర్షాకాల సమావేశాలు) అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తించిన కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు నిన్న రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే ఆ ఎంపీలు క్షమాపణ చెబితే.. వారిపై సస్పెన్షన్‌ వేటును వెనక్కి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తామని మంగళవారం కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.

‘సభా మర్యాదను కాపాడేందుకు ప్రభుత్వం ఈ సస్పెన్షన్ ప్రతిపాదనను సభ ముందు ఉంచాల్సి వచ్చింది.  దురుసుగా ప్రవర్తించినందుకు గానూ ఈ 12 మంది ఎంపీలు సభకు, ఛైర్మన్‌కు క్షమాపణ చెబితే.. ప్రభుత్వం తన ప్రతిపాదనను విశాల హృదయంతో పరిగణించే అవకాశం ఉంది’ అని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ వేటుపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వర్షకాల సమావేశాల చివరి రోజైన ఆగస్టు 11న ప్రతిపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసిందన్నారు. కాగా, సదరు ఎంపీలపై శీతకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ కొనసాగుతుంది.

సస్పెండ్‌ అయిన 12మంది సభ్యులు వీరే..

ఫూలోదేవి నేతం (కాంగ్రెస్‌), ఛాయా వర్మ (కాంగ్రెస్), రిపున్‌ బోరా (కాంగ్రెస్), రాజామణి పటేల్‌ (కాంగ్రెస్‌), అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (కాంగ్రెస్‌), సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌ (కాంగ్రెస్‌), డోలా సేన్‌ (తృణమూల్‌), శాంతా ఛత్రీ (తృణమూల్‌),  ప్రియాంకా చతుర్వేది (శివసేన), అనిల్‌ దేశాయ్‌ (శివసేన), బినోయ్‌ విశ్వం (సీపీఐ), కరీం (సీపీఎం)

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని