Modi: అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాష్టింగ్టన్‌ విమానాశ్రయంలో ఆయన ఘనస్వాగతం లభించింది.

Updated : 23 Sep 2021 13:06 IST

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో మోదీకి స్వాగతం పలికారు. మూడు రోజులపాటు అక్కడ ఆయన పర్యటన కొనసాగనుంది. 

అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగనుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, క్వాడ్‌ సదస్సుల్లో ఆయన పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్‌ పరిణామాలు తదితర అంశాలపై వారితో మోదీ చర్చించనున్నారు. ఈనెల 26న ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని