Modi: ఆ కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడే హక్కుల ఉల్లంఘన కనిపిస్తుంది

తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కొందరు మానవ హక్కుల అంశాన్ని మలుచుకోవడం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఆ తీరు ప్రజాస్వామ్యానికి హాని తలపెడుతుందని విమర్శించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

Published : 12 Oct 2021 23:24 IST

ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మోదీ

దిల్లీ: తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కొందరు మానవ హక్కుల అంశాన్ని మలచుకోవడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఆ తీరు ప్రజాస్వామ్యానికి హాని తలపెడుతుందని విమర్శించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

‘కొందరు వ్యక్తులు కొన్ని ఘటనల్లో మానవ హక్కుల ఉల్లంఘనల్ని ఎత్తి చూపుతారు. అదే తరహాలో జరిగిన ఇతర ఘటనల్లో మాత్రం నోరు మెదపరు. రాజకీయ కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు మాత్రమే వారికి ఉల్లంఘన గురించి కనిపిస్తుంది. ఈ వైఖరి ప్రజాస్వామ్యానికి హాని తలపెడుతుంది. మరికొందరు మానవ హక్కుల పేరిట దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. దాని గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. హక్కుల విషయంలో రాజకీయంగా పొందే లాభాలు, నష్టాలపై దృష్టి పెట్టడం సరికాదు’ అంటూ మోదీ తప్పుపట్టారు. రాజకీయాలకు భిన్నంగా అట్టడుగు వర్గాల హక్కులు, గౌరవాన్ని కాపాడటంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.

అహింసాయుత ఉద్యమం ద్వారా భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీని మానవ హక్కులు, మానవ విలువలకు ప్రతీకగా ఈ ప్రపంచం చూస్తోందన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భారత్ మానవ హక్కులకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చే పథకాలు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు, అబార్షన్ చట్టాల్లో సంస్కరణ వంటి వాటి ఉద్దేశమూ ఇదేనని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని