
Modi: కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
కేదార్నాథ్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో పవిత్ర ఛార్‌దామ్ యాత్రల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది గురువు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ ఉదయం దేహ్రాదూన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) గుర్మీత్ సింగ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కేదార్నాథ్ చేరుకున్న మోదీ.. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేదారీశ్వరుడికి హారతి సమర్పించారు. అనంతరం ఆది శంకరాచార్య సమాధి స్థలం వద్ద ఆది గురువు 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.
2013లో కేదార్‌నాథ్‌లో సంభవించిన వరదల ధాటికి ఆది శంకరాచార్య సమాధి కూడా ధ్వంసమైంది. దీంతో 2019లో ఈ సమాధి పునర్నిర్మాణంతో పాటు 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. 12 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించారు. అనంతరం ఆదిగురువు ముందు కూర్చుని కొంతసేపు ధ్యానం చేశారు.
పర్యటనలో భాగంగా కేదార్నాథ్ పరిసరప్రాంతాల్లో రూ.400కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించి మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.