Published : 16 Dec 2021 12:33 IST

Vijay Diwas: 1971 యుద్ధం..అణచివేత శక్తులపై జరిగిన పోరాటం..! 

‘విజయ్ దివస్’ సందర్భంగా అమర జవాన్లకు మోదీ నివాళి

దిల్లీ: సరిగ్గా 50 ఏళ్ల క్రితం పాకిస్థాన్ నడ్డివిరిచి పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్‌-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్‌ అవతరణకు కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా భారత్‌ ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ట్విటర్ వేదికగా స్పందించారు. యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. 

50వ విజయ దివస్ సందర్భంగా బంగ్లాకు చెందిన సాయుధ బలగాలు, భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యపరాక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. మనం కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించాం. ఈ సమయంలో రాష్ట్రపతి ఢాకా పర్యటన.. భారతీయుల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది- ప్రధాని మోదీ

1971 యుద్ధంలో మన సాయుధ బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు చిరస్మరణీయం. ఆ యుద్ధం భారత సైనిక చరిత్రలో సువర్ణాధ్యాయం. మన బలగాలు, వారు సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉంది - రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఈ యుద్ధం సమయంలో పాక్‌ సైనికుల గుండెల్లో గుబులు రేపారు ఫీల్డ్ మార్షల్ మానిక్‌ షా. ఆయన వ్యూహ రచనతో భారత్‌కు విజయాన్ని అందించారు.  ఆ సమయంలో 93 వేల మంది  పాక్‌ సైనికులు లొంగిపోయారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద లొంగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది. 

ఇదిలా ఉండగా.. 50వ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌.. కోవింద్‌ను ‘గౌరవ అతిథి’ గా ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు గుర్తుగా భారత్ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని