Navjot Singh Sidhu: సిద్ధూ పంతం నెగ్గింది.. అందుకు మంత్రివర్గ ఆమోదం

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మాటే చివరికి నెగ్గింది. ఆయన ఒత్తిడికి తలొగ్గుతూ.. అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఏపీఎస్‌ దేవోల్‌ రాజీనామాను రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. కొత్త ఏజీని బుధవారం

Updated : 10 Nov 2021 08:46 IST

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మాటే చివరికి నెగ్గింది. ఆయన ఒత్తిడికి తలొగ్గుతూ.. అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఏపీఎస్‌ దేవోల్‌ రాజీనామాను రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. కొత్త ఏజీని బుధవారం నియమించనున్నట్లు ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం దేవోల్‌ చేసిన రాజీనామాను ఆమోదించి రాష్ట్ర గవర్నర్‌కు పంపించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సిద్ధూ, ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీ, కొందరు మంత్రులు ఉన్నారు. అలాగే కొత్త డీజిపీ నియామకానికి గాను 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్‌ పోలీసు అధికారులతో కూడిన జాబితాను ఇప్పటికే కేంద్రానికి పంపించినట్లు చన్నీ తెలిపారు. పంజాబ్‌లో ఏజీగా దేవోల్‌, డీజిపీగా ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌ సహోతాల నియామకాలను సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరి నియామకంపై సొంత పార్టీ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 1న వ్యక్తిగత కారణాలను ఉటంకిస్తూ దేవోల్‌ రాజీనామా చేయగా.. ఇంతవరకూ ముఖ్యమంత్రి ఆమోదించకపోవడంతో సిద్ధూ అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయాలతో సిద్ధూ పంతం నెగ్గించుకున్నట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని