‘ఇలా చుడితే రాకెట్ గ్రిప్ బాగా ఉంటుంది సర్‌’.. మంత్రికి సింధు పాఠాలు

కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సోమవారం బ్యాడ్మింటన్ రాకెట్లను బహుమతిగా అందించారు. ఈ రోజు పద్మ భూషణ్ అవార్డు అందుకున్న ఆమె అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రిని కలిసి ముచ్చటించారు. ఈ విషయాన్ని రిజిజు ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

Published : 08 Nov 2021 21:27 IST

దిల్లీ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సోమవారం బ్యాడ్మింటన్ రాకెట్లను బహుమతిగా అందించారు. ఈ రోజు పద్మ భూషణ్ అవార్డు అందుకున్న ఆమె అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రిని కలిసి ముచ్చటించారు. ఈ విషయాన్ని రిజిజు ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

‘పీవీ సింధు సాధించిన విజయాలకు గానూ పద్మ భూషణ్ అవార్డు దక్కడం క్రీడారంగానికి గొప్ప గౌరవం. అభినందనలు సింధు. అలాగే నాకు అత్యంత నాణ్యమైన బ్యాడ్మింటన్ రాకెట్లు బహుమతిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే రాకెట్ హ్యాండిల్ గ్రిప్‌ను ఎలా చుట్టాలో నేర్పినందుకు ధన్యవాదాలు’ అంటూ వారి సంభాషణకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. 

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు దిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సింధు పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని