Parliament: సైకిల్‌పై పార్లమెంట్‌కు రాహుల్‌, విపక్ష ఎంపీలు

దేశంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో విపక్షాలు మంగళవారం ‘సైకిల్‌ ర్యాలీ’ చేపట్టాయి. రాహుల్ సహా ప్రతిపక్ష ఎంపీలు

Updated : 03 Aug 2021 13:44 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో విపక్షాలు మంగళవారం ‘సైకిల్‌ ర్యాలీ’ చేపట్టాయి. రాహుల్ సహా ప్రతిపక్ష ఎంపీలు సైకిల్‌ తొక్కుకుంటూ పార్లమెంట్‌ సమావేశాలకు వచ్చారు. అంతకుముందు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో వీరంతా అల్పాహార విందు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ.. ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడే ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా వారితో రాహుల్‌ సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. విపక్షాలు ఐకమత్యంగా ఉండాలని, అప్పుడే మన గళాన్ని స్పష్టంగా వినిపించగలమని పిలుపునిచ్చారు. అనంతరం కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ నుంచి రాహుల్‌, ఇతర నేతలు సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. 

ఇటీవల సాగు చట్టాలకు నిరసనగా రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చిన విషయం తెలిసిందే. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన రాహుల్.. తన నివాసం నుంచి స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పార్లమెంట్‌కు వచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని