Published : 01 Nov 2021 19:48 IST

 Rakesh Tikait: ఆ రోజు వరకూ చూస్తాం.. కేంద్రానికి డెడ్‌లైన్ విధించిన రైతు నేత

దిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతు నేత రాకేశ్‌ టికాయత్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు గడువు విధించారు. లేదంటే దిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనల్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

‘కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకే గడువు ఉంది. లేదంటే నవంబర్ 27 నుంచి మా నిరసనలను ఉద్ధృతం చేస్తాం. గ్రామాల నుంచి ట్రాక్టర్లపై రైతన్నలు దిల్లీ చుట్టుపక్కల ఉన్న నిరసన ప్రాంతాలకు చేరుకుంటారు’ అని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ ట్వీట్ చేశారు. ఆదివారం కూడా ఈ తరహా హెచ్చరికే చేశారు. నిరసన ప్రాంతాల నుంచి రైతుల్ని బలవంతంగా తరలిస్తే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్లుగా మారుస్తామని హెచ్చరించారు. మా టెంట్లు తీసేయాలని ప్రయత్నిస్తే.. పోలీసు స్టేషన్‌, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాటిని ఏర్పాటు చేస్తామని మీడియాతో వ్యాఖ్యానించారు.

కేంద్రం సాగు చట్టాలను తీసుకువచ్చి ఏడాది కావొస్తున్న తరుణంలో టికాయత్ నుంచి ఈ ట్వీట్ వచ్చింది. ఆ చట్టాలపై పంజాబ్, హరియాణా, యూపీలోని కొందరు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అప్పటి నుంచి వారు దిల్లీ సరిహద్దుల్లోని టిక్రి, సింఘు, ఘాజిపూర్ ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, రైతు సంఘాలకు చెందిన నేతల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే అవి ఫలించలేదు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని