Ayodhya: 2023 డిసెంబరు నాటికి అయోధ్యలో భక్తులకు దర్శనాలు

శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండేళ్లలో ఆలయ గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందని

Published : 04 Aug 2021 19:21 IST

అయోధ్య: శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండేళ్లలో ఆలయ గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి. 2023 డిసెంబరు కల్లా భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నాయి. 2025 నాటికి ఆలయం పూర్తిగా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. మందిర ప్రాంగణంలో మ్యూజియం, డిజిటల్‌ ఆర్చివ్స్‌తో పాటు రీసర్చ్‌ సెంటర్‌ కూడా ఉండనున్నట్లు ట్రస్ట్‌ వర్గాలు వెల్లడించాయి. 

‘‘గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఐదు మండపాలు, గర్భ గుడి నిర్మాణ పనులు 2023 డిసెంబరు నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాతే మొదటి అంతస్తుకు శంకుస్థాపన చేయనున్నాం. గ్రౌండ్ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత రామ్‌లాలా విగ్రహాలను నూతన మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తాం. 2023 చివరి నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తాం’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గతేడాది ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామమందిరానికి భూమిపూజ చేశారు. దాదాపు 100 ఎకరాల్లో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రూ. 3వేల కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు రామమందిర ట్రస్ట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని