Sand Art: ఇసుకతో రామాయణం చెప్పిన సైకతశిల్పి

రామాయణ ఘట్టాలను తన సైకత శిల్పాలతో వివరించే ప్రయత్నం

Updated : 04 Nov 2021 11:39 IST

లఖ్‌నవూ: రామాయణ ఘట్టాలను తన సైకత శిల్పాలతో వివరించే ప్రయత్నం చేశాడు అయోధ్యకు చెందిన కళాకారుడు రూపేశ్‌ సింగ్‌.  రామాయణంలోని ప్రసిద్ధ ఘట్టమైన ‘భరత్‌ మిలాప్‌’తో పాటు.. రాముడు, సీత, లక్ష్మణుడికి సంబంధించిన సైకత శిల్పాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ‘‘పెయింటింగ్‌ నేర్చుకోవడానికి అయ్యే ఖర్చును భరించలేక సైకత కళను ఎంచుకున్నా. సులువుగా లభించే ఇసుక ద్వారా కళాఖండాలను సృష్టించగలుగుతున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పాన్ని రూపొందించాలనేది నా లక్ష్యం’’ అని రూపేశ్‌ సింగ్‌ పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని