
IN PICS: విమానాశ్రయ సౌకర్యాలతో ‘రాణి కమలాపతి’ రైల్వేస్టేషన్
భోపాల్: అత్యాధునిక హంగులతో ఆధునికీకరించిన ‘రాణి కమలాపతి’ రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతంలో హబిబ్‌గంజ్ పేరుతో ఉన్న ఈ రైల్వేస్టేషన్‌ను రాణి కమలాపతిగా మార్చారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని ఈ రైల్వేష్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గోండు పాలకురాలు రాణి కమలాపతి పేరుతో రైల్వేస్టేషన్‌కు పేరు పెట్టడంతో ఈ స్టేషన్ ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. భారతీయ రైల్వే భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో ఈ రైల్వేస్టేషన్ తెలియజేస్తోందని పేర్కొన్నారు. గతంలో విమానాశ్రయంలో మాత్రమే ఉండే సౌకర్యాలు ఇప్పుడు రైల్వేస్టేషన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రూ. 450 కోట్లతో ఆధునికీకరణ
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దాదాపు రూ. 450 కోట్లతో ఈ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించారు. దీనిని గ్రీన్ బిల్డింగ్‌గా రూపొందించారు. ఇందులో ఆధునిక, ప్రపంచస్థాయి సౌకర్యాలున్నాయి. దివ్యాంగులకు ఉపయోగపడేలా పలు నిర్మాణాలు చేపట్టారు. సమీకృత బహుళ-మోడల్ రవాణాకు కేంద్రంగా స్టేషన్‌ను పునరుద్ధరించారు. దేశంలో అత్యాధునిక హంగులున్న రైల్వేస్టేషన్లలో ఇది మొదటి స్థానంలో నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.