Moving Train: ఎన్నిసార్లు చెప్పినా అంతే.. కదులుతున్న రైలు నుంచి దూకి..

ఎన్ని హెచ్చరికలు చేసినా రైలు ప్రయాణాల సమయంలో కొందరు చూపే అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుంటుంది. తాజాగా పశ్చిమ్ బెంగాల్‌లోని పురూలియా రైల్వే స్టేషన్‌లో కూడా ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది.

Updated : 03 Dec 2021 12:54 IST

వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడిన రైల్వే అధికారి

కోల్‌కతా: ఎన్ని హెచ్చరికలు చేసినా రైలు ప్రయాణాల సమయంలో కొందరు చూపే అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుంటుంది. తాజాగా పశ్చిమ్ బెంగాల్‌లోని పురూలియా రైల్వే స్టేషన్‌లో కూడా ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. కదులుతున్న రైల్లో నుంచి దిగి, ఓ మహిళ చావు అంచుల వరకూ వెళ్లింది. వెంటనే రైల్వే సిబ్బంది స్పందించడంతో ప్రాణాలతో బతికి బయటపడింది. ఈ క్లిష్ట సమయంలో చురుగ్గా స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) ఎస్‌ఐ బబ్లూ కుమార్‌కు ఇప్పుడు నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆర్‌పీఎఫ్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఇద్దరు మహిళలు  కదులుతున్న సాంత్రాగాచి-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ప్లాట్‌ఫాం మీదకు దూకేశారు. ఒక మహిళ ప్లాట్‌ఫాం మీద పడిపోయింది. మరో మహిళ మాత్రం పట్టకోల్పోవడంతో ప్రమాదకర స్థితిలోకి జారిపోయింది. ఆమె తల కదులుతున్న రైలు, ప్లాట్‌ఫాం మధ్య వరకు చేరుకుంది. ఇదంతా చూస్తున్నవారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్పుడు అక్కడే విధులు నిర్వర్తిస్తోన్న ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బబ్లు కుమార్ చురుగ్గా స్పందించారు. వేగంగా పరిగెత్తి ఆ మహిళను వెనక్కి లాగారు. అక్కడ వేచి ఉన్న ప్రయాణికులు కూడా వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటన నవంబర్ 29న జరిగిందని ఆర్‌పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని