Russia: కెమెరామెన్‌ను రక్షించబోయి.. మంత్రి మృతి..!
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్
మాస్కో: ప్రమాదంలో చిక్కుకున్న ఓ కెమెరామెన్‌ను రక్షించబోయి ఓ మంత్రి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రష్యాలో చోటుచేసుకుంది. రష్యాలోని నొరిల్స్క్ ప్రాంతంలో జరిగిన విపత్తు ప్రతిస్పందన నిర్వహణ బృందాల శిక్షణా కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది.
రష్యన్ ఎమర్జెన్సీస్ మినిస్టర్‌గా ఉన్న జినిచెవ్ (55), నొరిల్స్క్ ప్రాంతంలో నిర్మిస్తోన్న ఓ అగ్నిమాపక కేంద్రం సందర్శనకు వెళ్లారు. అక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రిస్క్యూ టీం మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించారు. అదే సమయంలో ఆ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తోన్న ఓ కెమెరామెన్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు మంత్రి జినిచెవ్ నీటిలోని దూకారు. అతను నేరుగా నీటిలో ఉన్న బండరాతికి తగలడంతో జినిచెవ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా మీడియా వెల్లడించింది.
ఫెడెరల్ సెక్యూరిటీ సర్వీసస్‌లో సేవలందించిన జినిచెవ్.. 2018 నుంచి రష్యా అత్యవసర పరిస్థితులశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రక్షణ వ్యవహారాల్లోనూ జినిచెవ్ కొంతకాలం పాటు కొనసాగారు. జినిచెవ్ మృతిపట్ల అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Monkeypox: మంకీపాక్స్ టీకా తయారీకి ఎనిమిది ఫార్మా సంస్థల ఆసక్తి!
-
Movies News
RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
-
General News
Andhra News: ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ.. ప్రాజెక్టులకు భారీగా వరద
-
Sports News
PV Sindhu : వరల్డ్ ఛాంపియన్‌షిప్‌నకు పీవీ సింధు దూరం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Komatireddy venkatreddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కాక.. అసలు ఆయన మనసులో ఏముంది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు