Lakhimpur Kheri: లఖింపుర్‌ కేసు దర్యాప్తు బాధ్యతలు.. ఇక విశ్రాంత న్యాయమూర్తికి

లఖింపుర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను ఓ విశ్రాంత న్యాయమూర్తికి సుప్రీంకోర్టు అప్పగించింది. పంజాబ్‌-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ జైన్‌ ఈ కేసు దర్యాప్తును......

Published : 17 Nov 2021 17:49 IST

దిల్లీ: లఖింపుర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను ఓ విశ్రాంత న్యాయమూర్తికి సుప్రీంకోర్టు అప్పగించింది. పంజాబ్‌-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ జైన్‌ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. న్యాయబద్ధంగా, స్వతంత్రంగా ఈ కేసు దర్యాప్తు జరిగేలా రాకేష్ జైన్ దర్యాప్తును పర్యవేక్షిస్తారని చీఫ్‌ జస్టిస్‌ పేర్కొన్నారు.

లఖింపూర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్​ అధికారులను సుప్రీంకోర్టు చేర్చింది. వారు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కానందున దర్యాప్తు బృందంలో నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. సిట్‌ విచారణ పూర్తిచేసి స్థాయీ నివేదిక సమర్పించిన తర్వాత ఈ కేసు విచారణను మరోసారి చేపడతామని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది.

కారు కింద నలిగిపోయి నలుగురు.. ఘర్షణల్లో మరో నలుగురు

అక్టోబర్‌ 3న లఖింపుర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కాగా ఈ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్​మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆశిష్‌ మిశ్రాను సుదీర్ఘంగా విచారించి అనంతరం  అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని