
China: చైనాలో మరో 18 ప్రమాదకర వైరస్లు
బీజింగ్: కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి వైరస్ల కలకలం మొదలైంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ వైరస్ జంతువుల నుంచే మనుషులకు సోకిందని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా.. చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షలు చేశారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1725 వన్య ప్రాణులపై ఈ పరీక్షలు జరిపినట్లు వారు వెల్లడించారు.
చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన పలు జంతువులపైన కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. చైనాలోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త షూసు మాట్లాడుతూ.. ‘ఈ పరీక్షల ద్వారా 71 రకాల వైరస్లను గుర్తించాము. అందులో 45 వైరస్లను కొత్తగా కనుగొన్నాము. వీటిలో 18 రకాల మనుషులు, జంతువులకు కూడా చాలా ప్రమాదకరమైనవి. వైరస్ల వ్యాప్తిలో వన్యప్రాణులే కీలక పాత్ర పోషిస్తాయి అనడానికి ఈ వివరాలే ఉదాహరణ’ అని పేర్కొన్నారు. పిల్లుల మాదిరిగా ఉండే ‘సివెట్స్’ అనే జంతువుల్లోనే అత్యధికంగా ప్రమాదకర వైరస్లను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలాల నుంచి వచ్చే హెచ్కేయూ8 రకం వైరస్ ఓ సివెట్కు వ్యాప్తించినట్లు గుర్తించామన్నారు. ఇంకా పలు జంతువుల్లో కూడా ఈ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.