దూడ కోసం 3 కిలోమీటర్లు పరుగు...

యజమాని ద్విచక్ర వాహనంపై తన దూడను తీసుకెళ్తుండగా గేదె చూసి 3 కిలోమీటర్ల దూరం పరుగెత్తి తల్లి ప్రేమను చాటింది. చెన్నై పోరూర్‌కి చెందిన ప్రసాద్‌ మోహన్‌ పశువులను

Updated : 24 Nov 2021 06:58 IST

 

జమాని ద్విచక్ర వాహనంపై తన దూడను తీసుకెళ్తుండగా గేదె చూసి 3 కిలోమీటర్ల దూరం పరుగెత్తి తల్లి ప్రేమను చాటింది. చెన్నై పోరూర్‌కి చెందిన ప్రసాద్‌ మోహన్‌ పశువులను పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నారు. మేతకు వెళ్లిన ఓ గేదె అక్కడే దూడను ఈనింది. విషయం తెలుసుకున్న యజమాని మంగళవారం ఉదయం దూడని తీసుకుని ద్విచక్ర వాహనంపై మరొకరి సాయంతో ఇంటికి బయలుదేరారు. దీన్ని గుర్తించిన తల్లి గేదె వారి వెంట పరుగు తీసింది. సుమారు 3 కిలోమీటర్ల దూరం ఇలా వెళ్లింది. 

-న్యూస్‌టుడే, చెన్నై(విల్లివాక్కం)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని