Published : 18 Dec 2021 23:58 IST

Omicron: కర్ణాటకలో ఐదుగురు స్థానిక విద్యార్థులకు ఒమిక్రాన్‌

బెంగళూరు: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇవాళ ఒక్కరోజే 6 కేసులు బయటపడ్డాయి. వీటిలో దక్షిణ కన్నడ ప్రాంతంలోని రెండు వేర్వేరు విద్యాసంస్థలకు చెందిన ఐదురురు విద్యార్థుల్లో ఒమిక్రాన్‌ బయటపడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ వెల్లడించారు. అయితే వీరిలో ఎవరు కూడా విదేశీ ప్రయాణికులు కాకపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. మొదటి క్లస్టర్‌లో 14 కొవిడ్ కేసులు నమోదుకాగా.. అందులో నాలుగు ఒమిక్రాన్‌గా, రెండో క్లస్టర్‌లో 19 కేసులు నిర్ధారణ కాగా అందులో ఒకటి ఒమిక్రాన్‌గా తేలింది. యూకే నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో కర్ణాటకలో కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 14కు చేరింది. ఇద్దరు ఇప్పటికే కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఓ వ్యక్తి దుబాయ్‌కి తిరిగి వెళ్లిపోయాడు. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 11గా ఉంది.

కేరళలో నాలుగు కేసులు

కేరళ రాష్ట్రంలో శనివారం నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. రాజధాని తిరువనంతపురంలో ఇద్దరికి.. మలప్పురం, త్రిస్సూర్‌లో ఒక్కరి చొప్పున ఒమిక్రాన్‌ నిర్ధరణ అయ్యింది. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇందులో ఇద్దరు ఐసోలేషన్‌లో ఉన్నారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో కేరళలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 11కు చేరింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని