US lawmakers to Biden: అణ్వాయుధాలు ఉగ్రమూక చేతికి అందకుండా చూడండి..!

తాలిబన్ల చేతికి పాక్‌లోని అణ్వాయుధాలు చేరకుండా చూడాలని అమెరికా చట్ట సభ సభ్యులు అధ్యక్షుడు జోబైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. అఫ్గానిస్థాన్లో ఏం జరిగింది.. అమెరికా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటనే అంశంపై బైడెన్‌ సమాధానం చెప్పాలని వారు

Updated : 09 Dec 2022 13:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్ల చేతికి పాక్‌లోని అణ్వాయుధాలు చేరకుండా చూడాలని అమెరికా చట్టసభ సభ్యులు అధ్యక్షుడు జోబైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. అఫ్గానిస్థాన్లో ఏం జరిగింది.. అమెరికా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటనే అంశంపై బైడెన్‌ సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ‘‘తాలిబన్లు సరిహద్దులను సైనికీకరణ చేస్తే అమెరికా మిత్రులను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారా..? అణ్వాయుధ దేశమైన పాక్‌ను తాలిబన్లు అస్థిరపర్చకుండా మీ ప్లాన్లు ఏమిటీ.. తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గానిస్థాన్‌కు అణ్వాయుధాలు దక్కకుండా చేయడానికి ప్రణాళిక ఏమిటీ..?’’ అని అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల్లోని 68 మంది చట్టసభ సభ్యులు ప్రశ్నిస్తూ ఓ లేఖ రాశారు. 

తాలిబన్లు అఫ్గాన్‌ భూభాగాన్ని ఆక్రమించుకొన్న వేగం చూసి షాకైనట్లు ఆ సభ్యులు పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌లో మిగిలిన సైనికులను కూడా ఉపసంహరించుకోవడం స్వయంకృతాపరాధంగా అభివర్ణించారు. దీనికి తోడు ఇప్పుడు సిబ్బంది తరలింపులో అనవసర జాప్యం చేస్తున్నారని తప్పు పట్టారు.

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు మారిపోయి వేగంగా తాలిబన్ల పాలనలోకి వెళ్లిపోయిందన్నారు. మహిళలు, బాలికల అణచివేత  ప్రారంభమైందన్నారు. ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకొని ఇతర దేశాలకు పారిపోతుంటే.. తాలిబన్లు వారిని బలవంతంగా అడ్డుకొంటున్నారని చెప్పారు. అదే సమయంలో చైనా తాలిబన్లతో సంబంధాలు పెంచుకొంటోందని పేర్కొంది. అమెరికా బలగాల ఉపసంహరణతో తలెత్తే భౌగోళిక రాజకీయ మార్పులు ఇప్పటికే మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇవి కొన్ని దశాబ్దాలపాటు అమెరికాపై ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని