Afghan crisis: నేనెవర్నో వాళ్లకు తెలుసు.. ఇక్కడే ఉంటే చంపేస్తారు..!

‘నా దేశం అంటే నాకెంతో ప్రేమ. కానీ, ఇక నేనిక్కడ ఉండలేను..జీవించలేను..ఈ గాలి పీల్చలేను. ఎందుకంటే నేనెవర్నో వాళ్లకు తెలుసు. నేను వాళ్ల కంటబడ్డానో..నన్ను చంపేస్తారు. వాళ్లు చంపేస్తారని నాకు కచ్చితంగా తెలుసు’ అంటూ అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళా పాత్రికేయురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 27 Aug 2021 01:49 IST

మా వాళ్లకు మహిళలను గౌరవించడం రాదు..నేర్పుతాం: తాలిబన్‌ ప్రతినిధి

(ప్రతీకాత్మక చిత్రం)

కాబుల్‌: ‘నా దేశం అంటే నాకెంతో ప్రేమ. కానీ, ఇక నేనిక్కడ ఉండలేను..జీవించలేను..ఈ గాలి పీల్చలేను. ఎందుకంటే నేనెవర్నో వాళ్లకు తెలుసు. నేను వాళ్ల కంటబడ్డానో..నన్ను చంపేస్తారు. వాళ్లు చంపేస్తారని నాకు కచ్చితంగా తెలుసు’ అంటూ అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళా పాత్రికేయురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని వీడే పరిస్థితి రావడంతో ఉబికివస్తోన్న కన్నీటిని దిగమింగారు. 

కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైంది. దాంతో ఇంతకాలం చదువు, ఆటలు, ఉద్యోగం అంటూ బయటకు వచ్చిన మహిళలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. చాలామంది దేశం వీడుతున్నారు. అదే తరహాలో వహీదా ఫైజీ తాను పుట్టిన గడ్డను వదిలివెళ్తూ.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తన కలలన్నీ కల్లలయ్యాయని వాపోయారు. కాబుల్ విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంటూ తిరిగి తన దేశానికిరాక పోవచ్చన్నారు. ‘ఇక దీని తర్వాత.. ఇది నా దేశం కాదు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 

వారికి మహిళలను గౌరవించడం రాదు.. అప్పటివరకు ఇంట్లో ఉండండి..!

తాలిబన్ల దురాక్రమణపై వార్తలు రాగానే.. అందరు ఆలోచించింది అక్కడి మహిళల పరిస్థితి గురించే. ఇప్పుడున్న కనీస హక్కులు కూడా కోల్పోనున్నారని పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. అందుకు తగ్గట్టే ఉన్నాయి తాలిబన్‌ ప్రతినిధుల ప్రకటనలు కూడా ఉన్నాయి. మహిళలను గౌరవించే విషయంలో తమ ఫైటర్స్ ఇంకా శిక్షణ పొందనందున ప్రస్తుతానికి ఆడవారు ఇళ్లలోనే ఉండాలని చెప్పి, తమ బుద్ధి చాటుకున్నారు. ‘ఇది తాత్కాలికమే. మహిళలకు భద్రత కల్పించేందుకు తగిన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేవరకు మాత్రమే. మహిళలు తిరిగి తమ ఉద్యోగాలకు వచ్చే విధానాలపై పనిచేస్తున్నాం. అప్పటివరకు భద్రత దృష్ట్యా వారు ఇంట్లోనే ఉండాలి’ అంటూ తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్దీన్ తమ విధానమేంటో చెప్పేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు