Talibans: భారత్‌తోనూ మంచి సంబంధాలు కోరుకుంటున్నాం: తాలిబన్లు

భారత్‌తో సహా అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు.

Published : 27 Aug 2021 22:05 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో అఫ్గాన్‌లో తాలిబన్ల అధికారిక పాలన మొదలు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో సహా అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. ముఖ్యంగా అఫ్గాన్‌ వేదికగా ఏ ఇతర దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

‘‘ఈ ప్రాంతంలో భారత్‌ను అతిముఖ్యమైన భాగంగా భావిస్తున్నాం. అన్ని దేశాలు సహా భారత్‌తోనూ మంచి సంబంధాలను కోరుకుంటున్నాం. అఫ్గాన్‌ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారత్‌ తన విధానాన్ని రూపొందించుకోవాలని ఆశిస్తున్నాం’’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా అఫ్గాన్‌ వేదికగా ఏ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు అనుమతించమని ముందు నుంచీ స్పష్టం చేస్తున్నామని అన్నారు. భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న సమస్యలను రెండు దేశాలు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సి ఉందని తాలిబన్‌ అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఎందుకంటే రెండు దేశాలకు కూడా మాకు పొరుగు దేశాలేనని.. వారి ప్రయోజనాలు కూడా ఒకదానిపై ఒకటి ముడిపడి ఉన్నాయని తాలిబన్‌ ప్రతినిధి గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని