Covid Deaths: అక్కడ మరో 5 లక్షల కరోనా మరణాలు..!

కరోనా వైరస్ తోకముడిచినట్లే ముడిచి, మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఐరోపా ఖండంలోని పలు దేశాలు మరోసారి వైరస్‌ కోరల్లో చిక్కుకున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మరో 5 లక్షల మరణాలు సంభవించొచ్చని అంచనా వేసింది. 

Published : 04 Nov 2021 22:31 IST

ఐరోపాలో వైరస్ ఉద్ధృతి.. ఆందోళన వ్యక్తం చేసిన ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా వైరస్ తోకముడిచినట్లే ముడిచి, మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఐరోపా ఖండంలోని పలు దేశాలు మరోసారి వైరస్‌ కోరల్లో చిక్కుకున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మరో 5 లక్షల మరణాలు సంభవించొచ్చని అంచనా వేసింది. 

‘ఐరోపా ఖండంలోని  దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదే తీరుగా వైరస్ ఉద్ధృతి కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల మరణాలు సంభవిస్తాయని ఒక అంచనా’ అని ఆరోగ్య సంస్థ ఐరోపా విభాగం డైరెక్టర్ హన్స్ క్లూగే మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఐరోపాలో వరుసగా ఐదోవారం కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూడగా.. ఈ ఖండంలోనే కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్నట్లు ఆరోగ్య సంస్థ బుధవారం వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో కేసులు తగ్గడం లేక నిలకడగా కొనసాగడం కనిపిస్తోందని పేర్కొంది. ఇన్ఫెక్షన్ రేటు కూడా అక్కడే ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. ప్రతి లక్ష జనాభాకు 192 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా బ్రిటన్, రష్యా, టర్కీ, రొమేనియాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని