Updated : 29/11/2021 13:44 IST

Farm Laws: సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం

దిల్లీ: విపక్షాల గందరగోళాల మధ్య సోమవారం లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుపై చర్చ జరగాలని విపక్ష నేతలు డిమాండ్లు చేశారు. వీటిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో మూజువాణి ఓటుతో సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం దక్కింది. గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

పార్లమెంట్‌లో శీతకాల సమావేశాల మొదటి రోజే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెడతామని కేంద్రం ఇదివరకే వెల్లడించింది. చెప్పినట్లుగా ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధరీ పట్టుబట్టారు. ఇప్పటికే ఈ చట్టాలపై మోదీ క్షమాపణ చెప్పడంతో.. ప్రభుత్వం ఈ బిల్లుపై చర్చకు సుముఖంగా లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో విపక్షాల డిమాండ్ల మధ్యే బిల్లుకు ఆమోదం దక్కింది. వారి ఆందోళనలతో కార్యకలాపాలకు ఆటంకం వాటిల్లడంతో.. స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని