టీకా తీసుకున్నవారికి.. ఆస్పత్రి చేరిక తప్పినట్టే!

ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు గణనీయమైన పనితీరును చూపాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.

Updated : 16 Jul 2021 17:04 IST

ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు గణనీయమైన పనితీరు చూపాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్‌ ఓ అధ్యయనం నిర్వహించింది. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి సమయంలో నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొదటిది, అలాగే అతిపెద్దది కూడా. ఈ పరిశీలనలో భాగంగా ఆ సంస్థ పలు విషయాలను గుర్తించింది. దేశవ్యాప్తంగా మొత్తం 677 కొవిడ్ పాజిటివ్ వ్యక్తులపై దీన్ని నిర్వహించగా.. 80 శాతం మందికిపైగా డెల్టా వేరియంట్ బారిన పడ్డారని చెప్పింది.

ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైన విషయాలివి..

ఇప్పటికే ఒకటి లేక రెండు డోసుల టీకా తీసుకున్న అనంతరం కొవిడ్ బారిన పడిన వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. వారి నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించింది.

 వైరస్ సోకిన 677 మంది నమూనాలను విశ్లేషించగా.. అందులో 86.09 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌(B.1.617.2)ను గుర్తించింది.

 ఆ మొత్తం కేసుల్లో 9.8 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 0.4 శాతం మరణాలు సంభవించాయి. దీనిబట్టి టీకా తీసుకోవడం వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలు తగ్గుతున్నాయని అధ్యయనం సూచించింది.

 ఇక వీరిలో 482 (71 శాతం) మందికి లక్షణాలు కన్పించగా.. 29 శాతం మందికి ఏ లక్షణాలు లేవు. లక్షణాలు ఉన్నవారు.. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాస తీసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని