Afghan crisis: కాబుల్ దృశ్యాలు.. పశ్చిమ దేశాలకు సిగ్గుచేటు

కాబుల్‌ విమానాశ్రయంలో చోటుచేసుకున్న దృశ్యాలు పశ్చిమ దేశాలకు సిగ్గుచేటని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్ స్టీన్‌మీర్‌ అన్నారు. అఫ్గానిస్థాన్ తాలిబాన్ల వశం కావడంతో అక్కడి  ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు విమానాశ్రయాల వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో విమానాశ్రయం, విమానంలో పలు విదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 

Updated : 18 Aug 2021 09:21 IST


బెర్లిన్: కాబుల్‌ విమానాశ్రయంలో చోటుచేసుకున్న దృశ్యాలు పశ్చిమ దేశాలకు సిగ్గుచేటని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్ స్టీన్‌మీర్‌ అన్నారు. అఫ్గానిస్థాన్ తాలిబాన్ల వశం కావడంతో అక్కడి  ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు విమానాశ్రయాల వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో విమానాశ్రయం, విమానంలో పలు విదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 

‘కాబుల్ విమానాశ్రయంలో వెలుగుచూసిన దృశ్యాలు పశ్చిమ దేశాలకు సిగ్గుచేటు. అఫ్గాన్‌ పరిస్థితి.. మనం బాధ్యత తీసుకోవాల్సిన మానవ విషాదం. ఆ దేశంలో స్థిరమైన, ఆచరణీయమైన సమాజాన్ని నిర్మించేందుకు సంవత్సరాల తరబడి చేసిన ప్రయత్నం విఫలమైంది. దాంతో మన విదేశాంగ, సైనిక విధానంపై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి’ అని వాల్టర్ అభిప్రాయపడ్డారు. 

అఫ్గాన్ పరిణామాలు నాటకీయంగా, భయంకరంగా ఉన్నాయని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ అన్నారు. ‘స్వేచ్ఛా సమాజం కోసం పనిచేసిన వారికి, పాశ్చాత్య సమాజ మద్దతుతో ప్రజాస్వామ్యం, విద్య, మహిళల హక్కులపై దృష్టిసారించిన లక్షల మంది అఫ్గాన్లకు ఇది భయంకరమైన పరిణామం’ అని మెర్కెల్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని