
Modi Special: మరోసారి ప్రత్యేక తలపాగాతో మెరిసిన మోదీ
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా కనిపించే ఆయన.. ఈసారి కూడా వైవిధ్యమైన తలపాగా ధరించారు. 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ‘కోల్హాపురీ ఫెతా’గా పిలిచే పొడవైన కాషాయ రంగు తలపాగా చుట్టుకున్నారు మోదీ. కాలి మడమల వరకు వస్త్రం ఉండటం ఈ తలపాగా ప్రత్యేకత. ఎరుపు రంగు డిజైన్తో దీన్ని రూపొందించారు. నీలం రంగు కుర్తాతోపాటు చుడిదార్ ధరించారు. పైన జాకెట్ వేసుకున్నారు. ఎరుపు-తెలుపు వర్ణంలో ఉన్న కండువాను మెడలో వేసుకొని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గత స్వాతంత్ర్య, గణతంత్ర్య దినోత్సవాల సందర్భంగానూ ప్రధాని మోదీ వైవిధ్యంగా కనిపించారు. ఈ ఏడాది గణతంత్ర్య వేడుకల్లో జామ్నగర్ తలపాగా ధరించిన ప్రధాని, గతేదాడి స్వాతంత్ర్య వేడుకల్లో కాషాయం, పసుపు రంగుతో ఉన్న తలపాగా.. కాషాయ అంచు ఉన్న తెల్లటి కండువాను ధరించారు. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రటి తలపాగా ధరించారు. 2019 స్వత్రంత్య్ర వేడుకల్లో రాజస్థానీ సంప్రదాయ ఇంద్రధనస్సు తలపాగాను అలంకరించుకున్నారు. దేశ ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్వాతంత్ర్య, గణతంత్ర్య వేడుకల్లో సంప్రదాయ తలపాగాలను ధరిస్తున్నారు.
ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో జామ్నగర్ తలపాగాతో మోదీ
గతేడాది స్వాతంత్ర్య వేడుకల్లో కాషాయం, పసుపు రంగు తలపాగాతో..
2020 గణతంత్ర వేడుకల్లో ఇలా..
2019లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంద్రధనస్సు తలపాగాతో..
2019 రిపబ్లిక్ డే రోజున..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.